రేర్ జాబ్, సీఈఓ గకు నకామురాతో మల్టీభాషి బృందం

జపాన్‌లో జాబితా చేయబడిన ప్రముఖ ఆన్‌లైన్ ఆంగ్లము నేర్చుకొను వేదికలలో  ఒకటైన రేర్ జాబ్ ఇంక్., నేతృత్వంలోని పెట్టుబడిదారుల సమితి నుండి తాజా పెట్టుబడిని అందుకుందని మల్టీభాషి ఎంతో ఆనందంతో ప్రకటిస్తుంది.

మల్టీభాషి 2 సంవత్సరాల క్రితం, ఒక భాషను కొత్తగా నేర్చుకునే వినియోగదారులకు ఆ భాషను సమర్థవంతంగా నేర్చుకోవడంలో సహాయపడాలనే ఒకే ఒక ఎజెండాతో స్థాపించబడింది. నేడు మల్టీభాషికి 1.5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.ఈ స్టార్టప్‌ను ఎఫ్‌బి స్టార్ట్, ఆక్సిలర్, గ్రే మాటర్స్ క్యాపిటల్, ఎడబ్ల్యుఎస్ ఎడుస్టార్ట్ మరియు గూగుల్ లాంచ్‌ప్యాడ్ వంటి ప్రసిద్ధ యాక్సిలరేటర్లు ఎంచుకున్నాయి.

మల్టీభాషిలో 11 భాషలకు పైగా (ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, హిందీ మొదలైనవి) ఉన్నాయి, వీటి ద్వారా ఆంగ్లము బోధిస్తుంది. సుమారు 27,000 మంది వినియోగదారులు దీనిని 5 కి 4.4 గా రేట్ చేసారు, కావున ఇది విద్య / అభ్యాస రంగంలో అగ్రశ్రేణి అనువర్తనాల్లో ఒకటిగా నిలిచింది. వారు నేర్చుకునే విధానాన్ని మరింత సువులువుగా చేసే చాట్‌బోట్ మరియు వాయిస్ బోట్‌ను కలిగి ఉన్న కొన్ని అభ్యాస అనువర్తనాల్లో ఇది ఒకటి. కమ్యూనిటీ ఫీచర్ వంటి కొన్ని ఇతర లక్షణాలు అనువర్తనంలో తోటివారి అభ్యాసాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రీమియం / చెల్లింపు కోర్సులు ద్వారా మానవ శిక్షకుల మద్దతు కూడా పొందుతారు.

app screens

భారతదేశంలో, కమ్యూనికేషన్ పరంగా ఆంగ్లములో తమను తాము మెరుగుపర్చుకోవాలని, మంచి జీవనోపాధి మరియు జీవనశైలికి మార్గం సుగమం చేసుకునేందుకు ఆంగ్ల భాషను నేర్చుకోవాలనుకునే 460 మిలియన్ల బ్లూ మరియు గ్రే కాలర్డ్ ప్రొఫెషనల్ నిపుణులకు వారి లక్ష్యాన్ని చేరుకోవడంలో మల్టీభాషి చాలా ఆశాజనకంగా ఉంటుంది.

ఈ ప్రత్యేకమైన విభాగం యొక్క అవసరాలపై  దృష్టి పెట్టి, మల్టీభాషి ద్విభాషా శిక్షణ (11 భారతీయ భాషల ద్వారా ఆంగ్లము బోధించడం)పై మరింత కృషి చేస్తుంది, అలాగే ఉద్యోగ పాత్ర సంబంధిత సందర్భోచితీకరణ మరియు వర్చువల్ ట్యూటర్ నేతృత్వంలోని అభ్యాసంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది.

“ఈ లక్ష్యానికి నిజాయితీగా ఉంటూ, జట్టును బలోపేతం చేయడానికి, ఉత్పత్తిని మెరుగుపరచడానికి మరియు మార్కెట్లోకి లోతుగా చొచ్చుకుపోవడానికి మేము ఈ ఇటీవలి పెట్టుబడిని అందుకున్నాము” అని మల్టీభాషి వ్యవస్థాపకురాలు అనురాధ అగర్వాల్ అన్నారు. మిలియన్ల మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి వీలు కల్పించడమే  మల్టీభాషి యొక్క లక్ష్యం మరియు ఇలాంటి లక్ష్యంతోనే జపాన్‌లో రేర్ జాబ్ మరియు మల్టీభాషి రెండు విభిన్న మార్కెట్లలో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటానికి ఎదురుచూస్తున్నారు.

మల్టీభాషి వ్యవస్థాపకురాలు అనురాధ అగర్వాల్‌తో రేర్ జాబ్, సిఈఓ గకు నకామురా

మల్టీభాషి వంటి యువ స్టార్టప్‌కు రేర్ జాబ్ వంటి సంస్థ ఎదిగిన తీరు చాలా స్ఫూర్తిదాయకం మరియు పోటీ మార్కెట్‌లో ఉత్పత్తిని మరియు బృందాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లిన వారి అనుభవం నుండి నేర్చుకోవాలని మేము ఎదురుచూస్తున్నాము.

“అందరికీ, ప్రతిచోటా అవకాశాలు” అనే లక్ష్యంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చురుకైన పాత్రలు పోషించడానికి ఒక వేదికను నిర్మించాలని రేర్‌జాబ్ లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఆంగ్లం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న 10 మిలియన్ల జపనీయులపై దృష్టి సారించింది. 2007లో ఒక చిన్న స్టార్టప్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సంస్థ, 2014లో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా అవతరించటం ద్వారా కొత్త ఎత్తులను చేరుకుంది.

“మేము భారత ఆంగ్ల విద్యా పర్యావరణ వ్యవస్థలోని ఇతరులను చూసినప్పుడు, వాటిలో ఎక్కువగా సాధారణ తరగతికి చెందినవే, అవి నిజంగా తుది వినియోగదారుడు అందుకోలేనివి, చాలా ఖరీదుతో కూడుకున్నవి; లేదా స్వీయ అభ్యాసాన్ని మాత్రమే అందించే మరియు గేమిఫికేషన్‌పై ఎక్కువ దృష్టి సారించిన ఆన్‌లైన్ ప్లేయర్‌లు ఉన్నారు. ఈ వైవిధ్యమైన సంస్థలలో, మల్టీబాషి అభ్యాస ఫలితాలపై అచంచలమైన దృష్టితో పాటు స్వీయ-అభ్యాసం మరియు ట్యూటర్ నేతృత్వంలోని అభ్యాసాల కలయికతో నిజమైన అభ్యాస ఫలితాలను అందించడానికి ఒక ప్రత్యేకమైన నమూనాతో నిలిచింది.” అని రేర్ జాబ్ యొక్క సిఈఓ, గకు నకామురా అన్నారు.

“ఆంగ్లము నేర్చుకోవడం మంచి ఉద్యోగాలు పొందడానికి సహాయపడుతుందని తెలిసిన ప్రతిష్టాత్మక భారతీయులందరికీ, ముఖ్యంగా బ్లూ మరియు గ్రే కాలర్ కార్మికులకు ఆంగ్లము నేర్చుకోవడం ఒక లక్ష్యం. మల్టీభాషి ఈ సమస్యను సాంకేతిక పరిజ్ఞానం మరియు లైవ్ హ్యూమన్ కోచింగ్ ఉపయోగించి పరిష్కరిస్తోంది. ఇది ఒక భారీ మార్కెట్ – భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. నేను 2 సంవత్సరాల క్రితం మల్టీభాషిలో పెట్టుబడి పెట్టినప్పుడు, వారికి 1 లక్ష మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. వారు మూలధనాన్ని సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగించి చూపించారు. సంస్థ యొక్క భవిష్యత్తు గురించి నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వారు పొదుపరులు, మరియు వారికి గెలిచే హక్కు ఉందని వారు నిరూపించారు. ”అని మల్టీభాషిలో ప్రస్తుత పెట్టుబడిదారుడైన  డాక్టర్ అనిరుద్ద మల్పని అన్నారు.

భారత ప్రాంతీయ భాషా వ్యవస్థ స్టార్ట్అప్ల కేంద్రంగా మారింది మరియు ఈ రంగంలో ఆంగ్ల అభ్యాసం అనేది ప్రధాన డిమాండ్లలో ఒకటి. బాగా నిర్వచించబడిన ఉత్పత్తి వ్యూహంతో మరియు మంచి బృందంతో, ఈ సవాలును పరిష్కరించడానికి మరియు ఈ భారీ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మల్టీభాషి సరైన మార్గంలో వెళుతుంది.